BDK: బూర్గంపాడు మండలం నకిరేపేట పరిధిలోని దోమల వాగును సీతారామ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేస్తూ మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దేలా ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు ఇవాళ తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేపేట నుంచి వేపలగడ్డ వరకు సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.