కోనసీమ: కిశోర బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవడం వలన భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బివి సత్యనారాయణ అన్నారు. అమలాపురం మండలంలోని బండారు లంక PHC వద్ద కిశోర బాలికలకు నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించారు. వైద్యాధికారులు డాక్టర్ అమృత, డాక్టర్ గౌతమి పాల్గొన్నారు.