Director Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ‘ఒకే ఒక్కడు’ విలన్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయినా కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కు ఒకే ఒక్కడు విలన్‌గా మారాడు. శంకర్‌కే కాదు.. రామ్ చరణ్, కమల్ హాసన్ విలన్ కూడా అతనే.
ట్రిపుల్(RRR) తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ(Game Changer Movie) చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan). దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పైఉంది. అయితే వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. ఈపాటికే గేమ్ ఛేంజర్ థియేటర్లోకి వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసేంది. కానీ ఊహించని విధంగా మధ్యలోకి ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇండియన్ 2 లైన్లోకి వచ్చేసింది. దీంతో గేమ్ ఛేంజర్‌తో పాటే కమల్ హాసన్‌తో ఇండియన్ 2ని కూడా ఈక్వల్‌గా షూట్ చేస్తున్నాడు శంకర్. నెలలో హాప్ హాప్ డేస్‌ని ఈ రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నాడు.
అయితే ఈ రెండు సినిమాల్లోను విలన్ ఒక్కడే కావడం ఇప్పుడు విశేషంగా మారింది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎస్.జె. సూర్య గురంచి అందిరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఖుషి వంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు సూర్య. అయితే ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నాడు ఎస్.జె.సూర్య. ముందుగా గేమ్ ఛేంజర్ సినిమాలో మాత్రమే విలన్ అనుకున్నప్పటికీ.. లేటెస్ట్గా భారతీయుడు సీక్వెల్‌ను మెయిన్ విలన్ సూర్యనే న్యూస్ బయటికొచ్చింది.
దీంతో శంకర్‌కు విలన్ ఒకే ఒక్కడు అని అంటున్నారు. గతంలో మహేష్ బాబు, మురుగ దాస్ ‘స్పైడర్’ మూవీలో ఎస్ జే సూర్య సైకో విలన్‌గా అందరినీ భయపెట్టేశాడు. దాంతో చరణ్, కమల్ హాసన్‌తో సూర్య విలనిజం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. మరి ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో సూర్య విలనిజం ఎలా ఉంటుందో చూడాలి.