రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. మృగశిర కార్తె (Mrigashira Karte) తొలి రోజులలో చేపల తినడం అనవాయితీగా నాన్ వెజ్ ప్రియులు భావిస్తుండటంతో హైదరాబాద్ (Hyderabad) రాంనగర్ చేపల మార్కెట్లో రెండు రోజులుగా సందడి నెలకొన్నాది. ఏటా మృగశిర కార్తె రావడంతో తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. మార్కెట్‌కు వందల కొద్ది లారీల్లో చేపలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల టన్నుల చేపలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.ఇక రవ్వ, బొచ్చ, కొర్రమీను, టంటం, పాంప్లెట్, బంగారు తీగ వంటి పలు రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. దీంతో మార్కెట్లన్నీ వ్యాపారులు, జనాలతో కిటకిటలాడాయి.చేపల ధరలు కూడా గత ఎడాదికన్నా మరింత పెరిగాయి.
హోల్ సేల్ మార్కెట్ లో సాధారణంగా రవ్వ, బొచ్చ రూ.70 నుంచి 90కు కేజీ అమ్ముడవుతూ ఉంటారు. మృగశిర కార్తె సందర్భంగా వీటి ధర ఏకంగా రూ.120 నుంచి 200 వరకు పలుకుతున్నాయి. హైబ్రిడ్ కొర్రమీను(Korraminu) కేజీ రూ.300 నుంచి 400కు చేరుకుంది. నాటు కొరమీను రూ.500 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. రిటైల్ గా లైవ్ చేప కిలో రెండు వందలు కాగా, ఐస్ లో ఉంచిన ఫిష్ ను కిలో 150కి అమ్ముతున్నారు..కాగా ముషీరాబాద్ చేపల హోల్ సేట్ మార్కెట్ (Whole sale market) నుంచి నగరంలోని పలు ప్రాంతాల చిన్నాచితక వ్యాపారులు పెద్ద ఎత్తున అన్ని రకాల చేపలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి డిమాండ్‌ను బట్టి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.ఈ ఏడాది చేపల అమ్మకాలు రెట్టింపయ్యాయని వ్యాపారులు అంటున్నారు.