KMM: ఖమ్మం యూపీహెచ్ కాలనీ అభయ వేంకటేశ్వరస్వామి దేవస్థాన 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ప్రచార రథాన్ని ఛైర్మన్ అల్లిక అంజయ్య ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని, అన్నదానానికి విరాళాలు అందించి సహకరించాలని కోరారు.