ASR: డుంబ్రిగూడ మండలం కింజెరు గ్రామంలో 78 మీటర్లు, కుట్టి గ్రామంలో 110 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పంచాయతీ సర్పంచ్ లక్ష్మి హాజరై పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి డ్రైనేజ్ నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు. పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు.