AP: గల్ఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. APSADA సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా కేవలం 4 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ప్రభావం రాష్ట్ర ఆక్వారంగంపై చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.