Radha Krishna Kumar: డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక ఆ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) సంగతి చెప్పక్కర్లేదు. రాధేశ్యామ్ మూవీ తర్వాత ఆఫర్లు ఏమీ లేవు. ఇన్నాళ్లకు ఆయన తదుపరి మూవీపై క్లారిటీ వచ్చింది. విశాల్‌తో (vishal) నెక్ట్స్ మూవీ ఉంటుందని తెలిసింది. స్టోరీ లైన్ చెప్పగా.. విశాల్‌కు (vishal) నచ్చిందట.. మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
విశాల్‌తో (vishal) చేసే మూవీ కూడా కొత్త జోనర్లో ఉంటుందట. ఇప్పటివరకు అలాంటి సినిమా ఎవరూ తీయలేదట. సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో మూవీ తీయనుందట. మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని విశ్వసనీయంగా తెలిసింది. రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar)- విశాల్ కాంబోలో వచ్చే మూవీ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ముందుకు రాబోతుంది. తెలుగుతోపాటు తమిళం (tamil), కన్నడ (kannada), మలయాళం (malayalam), హిందీ (hindi) భాషల్లో తీస్తారట. ఈ సినిమా కూడా పాన్ ఇండియా (pan india) రేంజ్లో తీయడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. విశాల్‌తో (vishal) రాధాకృష్ణ చేసే మూవీ లైఫ్ అండ్ డెత్‌గా మారనుంది. ఈ సినిమా కూడా తేడా కొడితే అతని కెరీర్ క్లోజ్ అయ్యే అవకాశం లేకపోలేదు అని క్రిటిక్స్ అంటున్నారు.