కృష్ణా: గన్నవరంలోని వీకేఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందితో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నిర్ణీత సమయానికే కేంద్రానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించినట్లు యాజమాన్యం తెలిపింది.