ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరెస్తున్నారు. ఒకేసారి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దాంతో అల్లు, మెగా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్‌కు అహ్మదాబాద్‌లో అత్యంత ఘనంగా జరగనున్న ఆధ్యాత్మిక వేడుకలు.. PSM 100కి రావాలంటూ ఆహ్వానం అందింది. ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది వేడుకలో పాల్గొనాలంటూ చరణ్‌కి స్వామీజీల నుంచి ప్రత్యేకమైన ఇన్విటేషన్ అందింది. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీలతో కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారు చరణ్. ఈ ఆధ్యాత్మిక వేడుకలు డిసెంబర్ 15 నుంచి జనవరి 23 వరకు జరగనున్నాయి.
ఇదే సమయంలో అల్లు అర్జున్‌కు కూడా అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి గాను GQ మ్యాగజైన్ అందిస్తున్న ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సొంతం చేసుకున్నారు బన్నీ. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అల్లు అర్జున్ నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేశారు బన్నీ. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. తన లిస్టులో ఉన్న టార్గెట్స్‌లో ఓ టార్గెట్ అఛీవ్ అయ్యానని పేర్కొన్నాడు. ఇలా చరణ్, బన్నీ అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.