NZB: మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన ముజిగా శ్యామ్ (43) మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు SI సుస్మిత బుధవారం తెలిపారు. జీవనోపాధి కోసం ఎన్.ఎస్.పీ కెనాల్ వద్ద చేపలు పట్టుచుండగా ప్రమాదవశాత్తూ ఆయన కాలికి ఉడెన్ వల చుట్టుకుని కెనాల్ నీటిలో జారి పడటం వల్ల మృతి చెందడన్నారు.