భద్రాచలం పట్టణానికి చెందిన వెంకన్న వడదెబ్బతో ఆదివారం మృతి చెందగా మృతదేహాన్ని తరలించేందుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ దొరకలేదు. దీంతో సిబ్బంది పట్టించుకోకపోవడంతో బంధువులు శవాన్ని భుజాలపైనే మోసుకెళ్లారు. పాలకులు డిజిటల్ వైద్యం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నా, కనీస సౌకర్యాలు కరువయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు.