మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 65 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ప్రక్రియను మరో 10 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50,134 మంది రైతుల నుంచి 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 34,460 మంది రైతుల ఖాతాల్లో రూ.379.47 కోట్లు జమచేసిపట్లు పేర్కొన్నారు.