E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెం వికాస్ కాలేజీ వెనుక ఉన్న కాలనీలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.25 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి రామోహన్ తెలిపారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో TDP అధ్యక్షుడు గోగిన శ్రీనివాస్, కూటమి నేతలు పాల్గొన్నారు.