KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ, రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు. ఈ పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సకాలంలో హాజరుకావాలని ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.