KNR: రామడుగు మండలం లక్ష్మీపుర్ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. రేణుకా ఎల్లమ్మ పట్నాలలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.