WGL: రైతులు తమ పంట పొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడం చట్ట విరుద్ధమని గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు. ఇటువంటి చర్యల వల్ల అమాయకులు, ముఖ్యంగా పిల్లలు, పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.