KMM: నేలకొండపల్లి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఒక అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పరంజ్యోతి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.