MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం అటవీ శిక్షణ, అధ్యయనాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ అభయారణ్యాయానికి జన్నారం ప్రధాన కేంద్రంగా ఉంది. అడవులు, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది, అటవీ కళాశాల విద్యార్థులు అభయారణ్యానికి వచ్చి ఆయా అంశాలపై శిక్షణ పొందుతున్నారు.