AP: తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి తిరుపతిలోని అవిలాల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ చెరువు పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, దీనిని ఒక అద్భుతమైన టూరిజం స్పాట్‌గా మారుస్తామని ఆయన వెల్లడించారు. తిరుపతి వాసులకు ఇది త్వరలోనే సరికొత్త పర్యాటక ఆకర్షణగా మారనుంది.