RR: షాద్నగర్ ఆర్డివో కార్యాలయం సమీప హైవేపై చెల్లాచెదురుగా చెత్త దర్శనమిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు బాధ్యతరహితంగా ఇలా రాత్రి వేళల్లో కార్యాలయ సమీపంలో చెత్త వేయడం సరికాదని, చెత్త సేకరించడానికి వాహనాలు రోజువారిగా అందుబాటులో ఉన్నాయన్నారు. లేనియెడల ఇంటి దగ్గరే గార్బేజ్ డబ్బాను ఏర్పాటు చేసుకుని అందులో చెత్తను వేయాలని కోరారు.