కోనసీమ: అమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని కేసును కేవలం ఐదు గంటల్లోనే ఛేదించారు. కళాశాలకు వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, డీఎస్పీ ప్రసాద్ ఆదేశాలతో సీఐ వీరబాబు బృందం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. సాయంత్రం 6 గంటలకల్లా ఆమె ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.