MHBD: నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీచేసారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అలాగే పలువురు విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.