KDP: రైల్వే స్టేషన్లో వన్ టౌన్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ చిన్న పెద్దయ్య, ఎస్సై అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ పరిసరాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల లగేజీలను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.