SRD: నారాయణఖేడ్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ వారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గ్రామపంచాయతీలో రోడ్లు శుభ్రత, మురికి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పనులను పర్యవేక్షించారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని కోరారు.