KRNL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు హాజరై ఆమె సేవలను స్మరించారు. అభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని నేతలు గుర్తుచేశారు.