KKD: కమలాపురం మండలం కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 422 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ మోహన్, ఎస్సై విద్యాసాగర్ మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.