PPM: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గిరిజన పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుమ్మలక్ష్మిపురం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.