MNCL: పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం దండేపల్లి మండలంలోని ఐదు గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గోదావరి నది పుష్కరాల సందర్భంగా గూడెం గుట్ట కాంప్లెక్స్‌ను పరిశీలించారు.