మహిళా రెజ్లర్ల(wreslers) నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్(Brij Bhushan saran) మరోసారి రియాక్ట్ అయ్యాడు. తనపై ఒక్క ఆరోపణ రుజువైనా తనకు తానే ఉరివేసుకుంటానని వెల్లడించారు. రెజ్లర్లంతా తన పిల్లల్లాంటి వారని, తన రక్తం, చెమట కూడా వారి విజయానికి కారణమైనందున వారిని ఏ విషయంలోను నిందించలేనని అన్నారు. రాంనగర్ ప్రాంతంలోని మహదేవ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై ఒక్క ఆరోపణ రుజువైనా కూడా తాను ఉరి వేసుకుంటానని అందరి ముందు తెలియజేశారు.
‘నన్ను ఉరి తీయాలని రెజ్లర్లు(wreslers) కోరుతూ నాలుగు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నన్ను ఉరి తీయడం లేదు. అందుకే వారు తమ పతకాలను గంగలో ముంచేందుకు వెళుతున్నారు. పతకాలను గంగలో విసిరినంత మాత్రాన బ్రిజ్ భూషణ్ ను ఉరి తీయరు. మీ వద్ద రుజువులు ఉంటే కోర్టుకు వెళ్లి ఇవ్వవచ్చు. కోర్టు నన్ను ఉరితీస్తే నేను దానిని అంగీకరిస్తాను’ అని బ్రిజ్ భూషణ్(Brij Bhushan saran) అన్నారు.
‘ఆటగాళ్లంతా నా బిడ్డలాంటి వారే కదా. కొద్దిరోజులకు ముందు వరకు నన్ను రెజ్లింగ్ దేవుడు అని పిలిచేవారు. నేను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్గా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోనే భారత్కు 20వ ర్యాంక్ వచ్చిందని మరువకండి. ఈ రోజు నా కష్టంతో ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రెజ్లింగ్(wreslers) జట్లలో భారత్ నిలిచింది.’ అని బ్రిజ్ భూషణ్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బ్రిజ్ భూషణ్(Brij Bhushan saran) తెలిపారు.