»Condoms And Birth Control Pills In Madhya Pradesh Govt Wedding Kit
Wedding Kitలో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు.. ముఖ్యమంత్రి మీకు సిగ్గు లేదా?
‘సిగ్గు మాలిన పని’గా ఎంపీసీసీ పేర్కొంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిగ్గు వదిలేశారా? వివాహాలు చేసుకునే వధువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
సామూహిక వివాహం చేసుకున్న కొత్త వధూవరులకు (Newly Married Couple) ప్రభుత్వం అందించిన కానుక విస్మయానికి గురి చేసింది. పెళ్లయిన నూతన దంపతులకు ఇచ్చిన కానుకలో ఊహించని వస్తువులు కనిపించాయి. ఇంతకీ ఇచ్చిన కానుకలో ఏం ఉన్నాయో తెలుసా.. కండోమ్ (Condom), గర్భ నిరోధక మాత్రలు (Pills) కనిపించాయి. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ వస్తువులు కనిపించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ సంఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్యా వివాహం పథకం (Mukhyamantri Kanya Vivah/Nikah Yojana) అమలు చేస్తోంది. ఈ పథకం ఇటీవల తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద వివాహాలు చేసుకునే వధువులకు గర్భధారణ పరీక్షలు (Pregnancy Tests) నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా జాబువా జిల్లాలో (Jhabua District) ఇటీవల దాదాపు 296 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు మేకప్ బాక్స్ లు అందించారు. ఆ డబ్బాల్లో దువ్వెన, బొట్టుబిళ్లలు, పౌడర్ తో పాటు కండోమ్ ప్యాకెట్లు (Condom Packets), గర్భ నిరోధక మాత్రలు (Birth Control Pill) కనిపించాయి. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ‘సిగ్గు మాలిన పని’గా ఎంపీసీసీ పేర్కొంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిగ్గు వదిలేశారా? అని ఎంపీ కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఈ వస్తువులు కనిపించడంపై వైద్య అధికారులు స్పందించారు. ‘ఆరోగ్య శాఖ అధికారులు (Health Officers) ఆ ప్యాకెట్లను కిట్ (Kits)లలో పెట్టి ఉంటారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు వాటిని ఉంచినట్లు తెలుస్తోంది. దీనికి మేం బాధ్యత (Responsible) వహించలేం. ఈ పథకం కింద దంపతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా రూ.49,000 జమ చేస్తున్నాం అంతే ’ అని జిల్లా వైద్య అధికారి భుర్సింగ్ రావత్ (Bhursingh Rawat) తెలిపారు.