కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేయకుండా ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. నిధులు తరలించేందుకు తెలంగాణ పర్యటన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.