PLD: చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు మంగళవారం సంజీవనగర్, శాంతినగర్ వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుళాయిల ద్వారా వస్తున్న నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి, స్థానిక మహిళలతో సరఫరాపై మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా, శుభ్రమైన తాగునీటిని అందించాలని ఆయన సిబ్బందిని కఠినంగా ఆదేశించారు.