PLD: పిడుగురాళ్ల సివిల్ కోర్టు ఆవరణలో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి ప్రవళిక తెలిపారు. ఈ కార్యక్రమంలో చెక్ బౌన్స్, ఆస్తి వివాదాలు, భార్యా భర్తల తగాదాలు, ఎక్సైజ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టు పిడుగురాళ్ల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.