అన్నమయ్య: మదనపల్లి ఆరోగ్యవరం సమీపంలోని ఓ క్రైస్తవ మిషనరీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏడుగురిపై పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ చిరంజీవి ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ వెంకటరమణ విచారణ చేపట్టారు. సిండికేటుగా ఏర్పడి నిధులు దారిమళ్లించారన్న ఆరోపణలతో లారెన్స్, అనిస్ మోసెస్, నెల్సన్, రతీశ్, వినీల్, జశ్వంత్ జాన్, దినేన్లపై కేసు ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు.