TPT: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్–I పరీక్ష మంగళవారం జరిగింది. జిల్లాలోని 84 కేంద్రాల్లో 24,736 మందికి గాను 24,307 మంది హాజరుకాగా 429 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,147 మందికి గాను 1,033 మంది పరీక్ష రాయగా 114 మంది హాజరుకాలేదు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.