MDK: రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్ఛ మున్సిపాలిటీకి ప్రజలందరూ సహకరించాలని రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరవ రోజు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. పలు వార్డుల్లో ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.