PDPL: కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ పుష్టి అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీసులో సోమవారం అధికారులు, ఉద్యోగులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లేబర్ కోడ్లపై అవగాహన కల్పించారు. కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత, వేతనాలు, ఉద్యోగ వ్యవస్థ తదితర ఉపయోగకర విషయాల గురించి వివరించారు.