కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందని చెబుతున్నారు. కన్నడ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్ ను విజయం వరిస్తుందని రుద్ర ప్రతాప్ పేర్కొన్నాడు. అన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఈ ఆధునిక యుగంలోనూ జ్యోతిష్యాలు (Astrology), జాతకాలు (Horoscope), వాస్తుదోషాలు వంటివి నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఇలాంటి నమ్మకాలు ఇంకా ఎక్కువ. అందుకే స్వామిజీలు, జ్యోతిష్యులు వీఐపీల స్థాయికి చేరుతున్నారు. తాజాగా అలాంటి ఓ జ్యోతిష్యుడు (Astrologer) చేసిన ప్రకటన తెలంగాణలో (Telangana) కలకలం రేపుతున్నది. అధికార బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) మాత్రం ఆనందం నింపింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి..
రుద్ర ప్రతాప్ కరణ్ (Rudra Karan Partaap) అనే వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుపొందాడు. ఈనెల 27న ఒక ట్వీట్ చేశాడు. ‘నమో రుద్రాయ. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ప్రస్తుత కేసీఆర్ (KCR) ప్రభుత్వమే తిరిగి ఎన్నికవుతుంది. అతడి పాలన మరోసారి (Another Time) కొనసాగుతుంది’ అని పోస్టు చేశాడు. ఆయన చెప్పిన జోష్యం నిజమవుతుందని అందరూ అనుకుంటారు. ఇటీవల కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందని చెబుతున్నారు. కన్నడ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్ ను విజయం (Victory) వరిస్తుందని రుద్ర ప్రతాప్ పేర్కొన్నాడు. అన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికవుతుందని ప్రకటించారు. ఆయన మాట వాస్తవం అవుతుందని నెటిజన్లు, ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ (Hattrick) సాధిస్తారని.. దక్షిణ భారతదేశంలోనే (South India) ముచ్చటగా మూడోసారి సీఎంగా ఎన్నికై కేసీఆర్ రికార్డు సృష్టిస్తాడని గులాబీ పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికలపై బీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ఉంది. వ్యూహాలకు గులాబీ దళం పదును పెడుతోంది.