TG: సిద్దిపేట జిల్లాలో కోళ్ల మృతి కలకలం రేపింది. మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో సుమారు 7700 కోళ్లు మృతి చెందాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని.. నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలేం జరిగిందో తెలియనుంది.