NLR: అల్లూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న ఆధార్ కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రజినీకాంత్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు బీరంగుంట, అల్లూరు-2, ఇసుకపల్లి-1 గ్రామాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం అల్లూరు-1, ఇందుపూరు, ఇసుకపల్లి-2 గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.