AKP: ఇద్దరు గంజాయి నిందితులకు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా సోమవారం తెలిపారు. నిందితులు వీ.జయరాం, జీ.భీమరాజు 2016 సెప్టెంబర్లో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ గౌరీపట్నం వద్ద పట్టుబడినట్లు తెలిపారు. నేరం రుజువు కావడంతో ఇవాళ శిక్ష పడిందన్నారు.