VSP: విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ (VER) నీటి భద్రత ప్రణాళికపై మంగళవారం ఓ హోటల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రుల మార్గదర్శకత్వంలో సింగపూర్, ఆస్ట్రేలియా సంస్థల సహకారంతో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.పెరుగుతున్న నీటి అవసరాలు, అంతర్జాతీయ నిర్వహణ పద్ధతులపై నిపుణులు చర్చించనున్నారన్నారు.