KMM: వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు.