Virat Kohli becomes only Indian & Asian with 250 mn Instagram followers
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి (Virat Kohli) విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ లో ఆయన టీమ్ ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా, కేవలం ఆయన కోసమే ఆ జట్టును సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నారు. కోహ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఈ పరుగుల రారాజు ఖాతాలో ఇప్పటి వరకు చాలా రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రికార్డు వచ్చి చేరింది.
కోహ్లీ (Kohli) సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటారనే విషయం తెలిసిందే. ఆ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇన్‌స్టాలో 250 మిలియన్ల మంది ఫాలోవర్ల మార్క్‌ను విరాట్ కోహ్లీ (Kohli) బ్రేక్ చేశాడు. 250 మిలియన్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న ఏకైక ఇండియన్ గా విరాట్ కోహ్లీ కావడం విశేషం. ఈ రికార్డు మరే ప్లేయర్ కూ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. దేశంలో మరే ప్లేయర్ కూ ఇంత మంది ఫాలోవర్లు లేరు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో కోహ్లీ (Kohli) మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీకి ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఇన్ స్టా గ్రామ్ లో కేవలం 4 కోట్ల మందే ఫాలోవర్లు ఉన్నారు. లెజెండ్ క్రికెటర్ సచిన్ ను 3.79 కోట్ల మందే ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతున్నారు.
వినియోగదారులను ప్రభావితం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలకు ఇన్ స్టా భారీగా డబ్బులు చెల్లిస్తుంది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని (Kohli) కూడా సోషల్ మీడియా ప్రభావితదారుల్లో టాప్ ప్లేస్ లో చేరింది. ఇన్ స్టాలో చేసే ఒక్కో పోస్టుకు విరాట్ కోహ్లీ రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే టాప్ కావడం విశేషం.