TG: 30 నెలల వ్యవధిలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా 2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల భూసేకరణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ.. జూన్ 2 నాటికి రూ. 5000 కోట్లు విడుదల చేస్తామన్నారు.