MLG: రాష్ట్రంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాత్రను బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.