VKB: కొడంగల్ మున్సిపాలిటీలో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. సోమవారం మున్సిపల్ పార్కులో వర్మి కంపోస్ట్ బెడ్ ప్రారంభించారు. కూరగాయలు, ఎండిన ఆకులు, పూల వ్యర్ధాలతో కంపోస్ట్ ఎరువులను తయారు చేయొచ్చని తెలిపారు. వ్యర్ధాల నుంచి సేకరించిన ఎరువు వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.