CTR: ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నాయకులు చొరవ చూపాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. చౌడేపల్లె మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తిరుపతిలో ఆయనను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ అంజిబాబు, కళ్యాణ భరత్ తదితరులు ఉన్నారు.