JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 43 రోజులకు గాను 14 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవాట్రస్ట్చే గురువారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,16,04,438 నగదు, 199 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగ్లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.